Saturday, May 4, 2024

AP : తాడేప‌ల్లికి వెళ్తుండ‌గా…నారా లోకేష్ కాన్వాయ్ తనిఖీ…

ఏపీలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌చ్చింది. ఈసీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో అనుమానం ఉన్న నేతలందరిపైనా నిఘా కూడా పెట్టారు. దీంతో అధికార, విపక్షాలన్న తేడా లేకుండా రాజకీయ పార్టీలు, నేతలందరికీ ప్రోటోకాల్ తో కూడా సంబంధం లేకుండా పోలీసులు వాహ‌నాల‌ను తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఉండవల్లి నుంచి తాడేపల్లికి బయలుదేరిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాహనాలను కూడా పోలీసులు తనిఖీలు చేశారు.

- Advertisement -

ఉండవల్లి కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసం నుంచి ఇవాళ నారా లోకేష్ తాడేపల్లికి బయలుదేరారు. లోకేష్ కాన్వాయ్ లో పలు వాహనాలు ఉన్నాయి. తాడేపల్లిలోని అపార్ట్ మెంట్ వాసులతో ముఖాముఖీ కార్యక్రమానికి లోకేష్ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఉండవల్లి సమీపంలోనే ఆయన కాన్వాయ్ ని పోలీసులు ఆపారు. దీంతో ఆయన కూడా వాహనాల తనిఖీకి సహకరించారు. పోలీసులు కాన్వాయ్ లోని అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement