Wednesday, May 1, 2024

నారా దేవాన్ష్ బ‌ర్త్ డే… తిరుమల శ్రీవారికి భారీ విరాళం

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు నారా దేవాన్ష్‌ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా నారా కుటుంబం భారీ విరాళాన్ని అందజేసింది. తిరుమల కొండ మీద ఒకరోజు అన్నప్రసాద వితరణకు గానూ రూ.33 లక్షల విరాళాన్ని లోకేష్, బ్రాహ్మణి దంపతులు అందజేశారు. తిరుమలలో తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణ కోసం ఈ విరాళాన్ని లోకేష్ దంపతులు కేటాయించారు. ప్రతి ఏడాది దేవాన్ష్‌ బర్త్ డే సందర్భంగా తిరుమలలో ఒకరోజు అన్నదాన వితరణకు అయ్యే ఆ మొత్తం వ్యయాన్ని విరాళంగా ఇస్తూ వస్తోంది నారావారి కుటుంబం. ఈ ఏడాది కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement