Monday, December 9, 2024

Tragedy: ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య..

ముగ్గురు పిల్ల‌ల‌తో క‌లిసి త‌ల్లి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన విషాద ఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లాలోని గాలివీడులోని చిలకలూరిపేటకు చెందిన వేముల నాగమణి, వేముల విక్రమ్ భార్యాభర్తలు. వీరికి నవ్యశ్రీ (10), దినేశ్ (6). జాహ్నవి (3) ముగ్గురు పిల్లలు. విక్రమ్ ఆటో నడపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చాలీ చాలని కుటుంబ ఆదాయంతో తరచూ ఇంట్లో గొడవలు జరిగేవి. ఇదే విషయమై శుక్రవారం రాత్రి భార్య నాగమణితో విక్రమ్‌ మళ్లీ గొడవపడ్డారు. గొడవ పెద్దది కావడంతో తన పిల్లలతో కలిసి నాగమణి ఇంటి నుంచి బయటకు వచ్చింది.

ఇంట్లో భర్తతో జరిగిన గొడవ కారణంగా తీవ్ర మనస్థాపనాకి గురైన ఆమె వెలిగల్లు ప్రాజెక్ట్ దగ్గర ఉన్న గండిమడుగులో పిల్లలతో కలిసి దూకింది. గండిమడుగు ఒడ్డున ఉన్న చెప్పులు, మొబైల్‌ను గుర్తించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వారి కోసం గాలించగా మృతదేహాలు లభ్యమయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై మృతురాలి నాగమణి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement