Friday, April 26, 2024

YCP ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి పెద్దపీట

సామాజిక న్యాయానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, శాస‌న మండ‌లిలో ఖాళీ స్థానాల భ‌ర్తీలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పెద్దపీట వేశారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అన్నారు. తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో 18 ఎమ్మెల్సీ స్థానాల‌కు వైయ‌స్ఆర్‌సీపీ అభ్య‌ర్థుల‌ను స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. శాసన మండలికి స్థానిక సంస్థల నుంచి జరుగుతున్న ఎన్నికలు, కొద్ది రోజుల్లో జరుగనున్న ఎమ్మెల్యే కోటా, గవర్నర్‌ కోటా ఎన్నికకు సంబంధించి సీనియర్‌ లీడర్లతో చర్చించి పార్టీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్లు పైనలైజ్‌ చేశారన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..

ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక జాబితా …

స్థానిక సంస్థలు..

  • నత్తు రామారావు.. శ్రీకాకుళం, లోకల్‌ కోటా (బీసీ, యాదవ)
  • కుడుపూడి సూర్యనారాయణ.. తూర్పు గోదావరి, లోకల్‌ కోటా (బీసీ-శెట్టి బలిజ)
  • వంకా రవీంద్రనాథ్‌.. పశ్చిమ గోదావరి,‍ లోకల్‌ ​కోటా (పారిశ్రామికవేత్త)
  • కవురు శ్రీనివాస్‌.. ప.గోదావరి, లోకల్‌ కోటా( బీసీ-శెట్టి బలిజ)
  • మేరుగ మురళి.. నెల్లూరు, లోకల్‌ కోటా (ఎస్సీ-మాల)
  • డా. సిపాయి సుబ్రహ్మణ్యం.. చిత్తూరు, లోకల్‌ కోటా
  • రామసుబ్బారెడ్డి.. కడప, లోకల్‌ కోటా (ఓసీ-రెడ్డి)
  • డాక్టర్‌ మధుసూదన్‌.. కర్నూలు, లోకల్‌ కోటా (బీసీ-బోయ)
  • ఎస్‌. మంగమ్మ.. అనంతపురం, లోకల్‌ కోటా( బీసీ-బోయ)

ఎమ్మెల్యే కోటా..

  • పెనుమత్స సూర్యనారాయణ.. విజయనగరం, ఎమ్మెల్యే కోటా( క్షత్రియ సామాజిక వర్గం)
  • పోతుల సునీత.. ప్రకాశం, ఎమ్మెల్యే కోటా (బీసీ- పద్మశాలి)
  • కోలా గురువులు.. విశాఖ, ఎమ్మెల్యే కోటా (ఫిషరీస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌)
  • బొమ్మి ఇ‍జ్రాయిల్‌.. తూ. గోదావరి, ఎమ్మెల్యే కోటా ( ఎస్సీ-మాదిగ)
  • జయమంగళ వెంకటరమణ, ప. గోదావరి, లోకల్‌ కోటా (వడ్డీల సామాజిక వర్గం)
  • ఏసు రత్నం.. గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( బీసీ-వడ్డెర)
  • మర్రి రాజశేఖర్‌.. గుంటూరు, ఎమ్మెల్యే కోటా ( కమ్మ)

గవర్నర్‌ కోటా..

  • కుంభా రవి.. అల్లూరి జిల్లా, (ఎస్టీ)
  • కర్రి పద్మశ్రీ.. కాకినాడ, (బీసీ)
Advertisement

తాజా వార్తలు

Advertisement