Thursday, May 2, 2024

ఆంధ్రప్రభ క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గంలోని నాగలూటీ గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి, కర్నూల్ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి లు ఈరోజు 2022 ఆంధ్రప్రభ క్యాలెండర్ లను ఆవిష్కరించారు. ముందుగా గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వై ఎస్ ఆర్ హెల్త్ సెంటర్ల ను మంత్రి అనిల్ కుమార్, బైరెడ్డి సిద్దార్థ రెడ్డిలు ప్రారంభించిన అనంతరం మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, ఆంధ్రప్రభ నందికొట్కూరు పాత్రికేయులు స్వామన్న, మిడుతూరు పాత్రికేయులు ప్రభాకర్ ల ఆధ్వర్యంలో ఆంధ్రప్రభ 2022 నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాగలూటీ సర్పంచ్ ఉషా రాణి, సింగిల్ విండో చైర్మన్ నాగ తులసి రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ తువ్వా శివరామ కృష్ణ రెడ్డి, నాగ తులసి రెడ్డి, వై కాపా నాయకులు చంద్ర మౌళి, ఉస్మాన్ భేగ్, రమేష్, బ్రహ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement