Thursday, May 2, 2024

Lunar Eclipse: 28న తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

ఈనెల 29వ తేదీన పాక్షిక చంద్రగ్రహణం ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల 28న సాయంత్రం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం మూతపడనుంది. దాదాపు 8 గంటలపాటు ఆలయ తలుపులు మూసివేస్తారు. ఈ నేపథ్యంలో ఆ రోజు శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులు మరో రోజుకు వాయిదా వేసుకోవడం మంచిది.

29వ తేదీ తెల్లవారుజామున 1.05 గంటలకు గ్రహణం మొదలై 2.22 గంటల వరకు కొనసాగుతుంది. గ్రహణ సమయానికి ఆరు గంటల ముందు ఆలయ తలపులు మూసివేయడం ఆనవాయితీ కావడంతో 28న రాత్రి 7.05 గంటలకు ఆలయ తలుపులు మూసివేస్తారు. 29న తెల్లవారుజామున ఏకాంతంలో ఆలయాన్ని శుద్ధిచేసి ఏకాంతసేవ నిర్వహిస్తారు. అనంతరం భక్తులను తిరిగి శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. చంద్రగ్రహణం కారణంగా పలు ఆలయాలు మూసివేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement