Friday, May 10, 2024

కృష్ణపట్నం, కాకినాడలో లాజిస్టిక్‌ పార్కులు.. కేంద్రాన్ని కోరిన ఏపీ సర్కారు..

అమరావతి ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో మల్డిdమోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. రాష్ట్రంలో నాలుగు లాజిస్టిక్‌ పార్కుల ఏర్పాటు-కు కేంద్రం అనుమతిని ప్రభుత్వం ఇప్పటికే కోరింది. కేంద్ర‌ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 35 మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల (ఎంఎంఎల్‌పీ)లో భాగంగా లాజిస్టిక్స్‌ ఎఫిషియెన్స్‌పై ఎన్‌హాన్స్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ కింద రెండు లాజిస్టిక్‌ పార్కులను ఏర్పాటు- చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వం పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ (పిపిపి) మోడ్‌లో వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కృష్ణపట్నం, కాకినాడ లేదా విశాఖపట్నం, అనంతపురంలో రెండు లాజిస్టిక్‌ పార్కుల కోసం ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించి ప్రతిపాదనలు పంపింది. బెంగళూరు, చెన్నై, నాగ్‌పూర్‌, గౌహతిలలో పనులు ఇప్పటికే ప్రారంభం కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా ప్రతిపాదన దశలో ఉన్నాయి. దేశం లోని ఏదైనా ఉత్పత్తి ఖర్చులో 13శాతం పైగా రవాణా వ్యయం నుండి వస్తుంది.

ఈ రవాణా ఖర్చును 8 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలను ప్రతిపాదించింది. సరుకు రవాణా ఖర్చులు, వేర్‌హౌస్‌ ఖర్చులు, వాహన కాలుష్యం, ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడం కోసం కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ, నేషనల్‌ హైవేస్‌ అథారిటీ- ఆఫ్‌ ఇండియా సంయుక్తంగా నిర్ధేశించుకున్న ప్రతిపాదనల్లో వస్తువుల రవాణా ఖర్చులు తగ్గించుకోవడంపై దృష్టి సారించాయి. కార్గో రవాణాలో ప్రమాదాలను తగ్గించడంపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ప్రతి రాష్ట్రంలో కనిష్టంగా 100 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల రవాణా సౌకర్యాలను కలిగి ఉండేలా లాజిస్టిక్‌ పార్కులకు రూపకల్పన చేస్తున్నారు. కస్టమ్స్‌ క్లియరెన్స్‌, క్వారం-టైన్‌ జోన్‌లు, టెస్టింగ్‌ సౌకర్యాలను అందించడంతో పాటు- వారికి ప్రత్యేకమైన స్టోరేజ్‌ సొల్యూషన్స్‌ కూడా లాజిస్టిక్‌ పార్కుల్లో ఉంటాయి. దేశంలో ఏదైనా ఉత్పత్తి ఖర్చులో 13 శాతం రవాణా వ్యయం నుండి వస్తుంది. ఈ రవాణా ఖర్చును 8 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రతిపాదించింది. తయారీదారులు లేదా పంపిణీదారులు తమ ఉత్పత్తులను పెద్ద పరిమాణంలో ఈ ప్రదేశాలకు తరలించడానికి ఈ మాదిరి పార్కులు దోహదపడతాయి, ఇది ఉత్పత్తి చేసే స్థలం నుండి పంపిణీ చేసే ప్రదేశానికి ఉత్పత్తుల రవాణా ఖర్చును తగ్గిస్తుంది.

ఇదిలా ఉండగా, రాష్ట్రంలో మరో రెండు మల్టిమోడల్‌ లాజిస్టిక్‌ పార్కులను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వం రెండో ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఓడరేవులు అందుబాటు-లో ఉన్న కాకినాడ, కృష్ణపట్నంలలో రెండు అదనపు లాజిస్టిక్‌ పార్కులను రాష్ట్రం ప్రతిపాదించింది. దీనిపై కేంద్రం నుంచి సానుకూల ప్రతిస్పందన వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement