Friday, May 17, 2024

ఏపీలో కౌలు రైతు ఆత్మహత్య… అప్పులే కారణం..

మండపేట: ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతినడం, అప్పుల కారణంతో మండపేట నియోజకవర్గానికి చెందిన కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మండపేట మండలంలోని పాలతోడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

గ్రామానికి చెందిన పిల్లా రామృకృష్ణ (49) అయిదు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేసాడు. పెట్టుబడులు, కుటుంబ అవసరాలకు రూ.3 లక్షల వరకు అప్పులు చేసాడు. ఇటీవల వర్షాలకు పంట దెబ్బతినడంతో అప్పులు తీర్చే మార్గంలేక బుధవారం మధ్యాహ్నం ఎలుకుల నివారణ మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఇది గమనించిన స్థానికులు అతనిని మండపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం  తీసుకెళ్తుండగా రామచంద్రపురం చేరేసరికి పరిస్థితి మరింత విషమించడంతో  రామచంద్రపురం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెంది నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రూరల్ ఎఎస్ఐ ఆర్. వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement