Monday, April 15, 2024

KNL: కేంద్ర కరువు బృందాన్ని అడ్డుకున్న అఖిలపక్ష నాయకులు..

కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న కేంద్ర కరువు బృందాన్ని అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు. తుగ్గలి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ ఇవాళ జొన్నగిరి గ్రామం మీదుగా వెళ్తున్న కేంద్ర కరువు బృందాన్ని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో రైతులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తుగ్గలి, జొన్నగిరి, మద్దికెర ఎస్సైలు మల్లికార్జున, రామాంజనేయులు, రిజ్వాన్ ల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement