Saturday, April 13, 2024

AP | చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

కర్నూలు, ప్ర‌భ న్యూస్ : చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన ఘటన కౌతాళం మండలం చిరుతపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న అమీర్, దేవేంద్ర, యువరాజ్ తమ గ్రామంలోని మామిడి చెట్ల వద్ద మధ్యాహ్నం వరకు ఆడుకున్నారు.

ఆ తర్వాత చెరువు దగ్గరకు ఈతకు వెళ్లారు. ఆ తర్వాత ముగ్గురు అమీర్ (11), దేవేంద్ర (11) నీటిలో మునిగిపోవడం చూసి యువరాజు గ్రామస్థులకు చెప్పాడు. తల్లిదండ్రులు, గ్రామస్తులు రక్షించేందుకు చెరువు వద్దకు వెళ్లేలోపే ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement