Friday, October 11, 2024

రైతు గొంతు కోసిన దుండ‌గులు.. చికిత్స పొందుతూ మృతి

కర్నూలు : ఎమ్మిగనూరు నియోజకవర్గం పరిధిలోని ఇబ్రహీంపూర్ లో దారుణం చోటుచేసుకుంది. కొంద‌రు గుర్తుతెలియ‌ని దుండ‌గులు రైతు గొంతు కోశారు. ఇది గ‌మ‌నించిన కొంద‌రు రైతును ఆస్ప‌త్రిలో చేర్పించారు. 15 రోజులుగా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న రైతు గురువారం మృతి చెందాడు. ఈ విష‌య‌మై 15 రోజులుగా బాధితులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు. రైతు మృతి చెందిన తర్వాత పోలీసులు హడావుడిగా నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. అధికార‌ పార్టీ నేతల హస్తం ఉండడంతో ఇన్ని రోజులు చర్యలు తీసుకోలేదని బాధితులు ఆవేదన వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement