Tuesday, April 16, 2024

హలో ఏఎస్ఐని మాట్లాడుతున్నా.. పోలీసుల పేరు చెప్పి మోసాలు..

తుగ్గలి, (ప్రభ న్యూస్‌) : మండల కేంద్రమైన తుగ్గలిలోని పోస్టాఫీస్‌కు ఎదురుగా బిసి మనీ బ్యాంకు నిర్వహిస్తున్న నిరుద్యోగి అనిల్‌కుమార్‌ సెల్‌కు ఏఎస్‌ఐ మాట్లాడుతున్నా అంటూ ఓ వ్యక్తి బురిడీ కొట్టించి డబ్బులు కాజేశాడు. తమ బంధువులు ఆసుపత్రిలో ఉన్నారు.. అర్జెంటుగా 9550566601 నెంబర్‌కు ఫోన్‌ పే చెయ్‌.. మా కానిస్టేబుల్‌ ద్వారా నేను డబ్బులు పంపుతానంటూ ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. ఫోన్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ నెంబర్‌ టూకాలర్‌లో ఏఎస్‌ఐ ప్రతాప్‌ రూరల్‌ అని రావడంతో నిజమేనని నమ్మి వెంటనే రూ.10 వేల అమౌంట్‌ తన సెల్‌ నుంచి పంపించాడు.

ఫోన్‌ పేకు డబ్బులు వేసిన తర్వాత అనిల్‌ పోలీసుస్టేషన్‌ నుంచి కానిస్టేబుల్‌ డబ్బులు తీసుకొస్తాడని ఎదురుచూశాడు. అయితే ఎవరూ అక్కడికి రాకపోవడంతో ఫోను చేసిన నెంబర్‌కు కాల్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ అయిపోయింది. అలాగే తాను ఫోన్‌పేకు అమౌంట్‌ పంపిన నెంబర్‌ కు ఫోను చేసినా ఎవరూ లిఫ్టు చేయలేదు. దీంతో మోసపోయానని తెలుసుకున్న అనిల్‌ తుగ్గలి పోలీసుస్టేషన్‌కు వెళ్లి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. ఈ సంఘ‌ట‌న‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement