Monday, April 29, 2024

KNL: సిద్దాపురం చెరువు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోండి..

ఆత్మకూరు రూరల్, జనవరి 3 (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని సిద్దాపురం చెరువులో వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీళ్లను నింపి పంట పొలాలకు సాగునీరందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఏ రాజశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదుట కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిపై రాస్తోరోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ రాజశేఖర్ మాట్లాడుతూ.. సిద్దాపురం చెరువు ద్వారా నీటిని వదలకపోవడంతో పంట పొలాలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని, రైతులు అప్పులపాలవుతారని, వెలుగోడు రిజర్వాయర్ నుంచి నీళ్లు వదిలి, ఆ నీటిని సిద్దాపురం చెరువు ద్వారా మండలంలోని అన్ని గ్రామాల్లో రైతాంగం వేసిన అన్నిరకాల పంటలకు సాగునీరందించి పంటలు ఎండిపోకుండా, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పంటలకు సాగునీరు అందించి రైతన్నలను ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వి.సుబ్బరాయుడు, సహాయ కార్యదర్శి టి.వెంకటేశ్వరరావు, జిల్లా నాయకులు శంకర్, వీరన్న, సంజీవ రాయుడు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి సుధాకర్, ఉపాధ్యక్షులు సామన్న, నాయకులు నరసింహ నాయక్, స్వాములు, రామ్ నాయక్, అంబయ్య, రంగస్వామి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement