Monday, April 29, 2024

KNL: పోలీస్ ఆయుధాల ప్రదర్శన

కర్నూలు : పోలీస్ (కమాండ్ డే) అమరవీరుల దినోత్సవంను పురస్కరించుకొని కర్నూలు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో గురువారం ఆయుధాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, విద్యార్థునులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏ ఆయుధం ఎలా వినియోగిస్తారు వంటి అంశాలను విద్యార్థులకు పోలీసులు వివరించారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ డాగ్ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా నేర పరిశోధనలో పోలీస్ డాగ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించడం జరిగింది. ఏ నేరంలో.. ఏ డాగ్.. ఎలా నేరస్తులను గుర్తించింది.. నేర పరిశోధనలో ఏ విధంగా సహాయపడింది.. తదితర అంశాలను విద్యార్థులకు పోలీస్ శాఖలోని ముఖ్య అధికారులు వివరించడం గమనార్హం. కార్యక్రమంలో జిల్లా ఎస్పి జి. కృష్ణ కాంత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement