Monday, April 29, 2024

ఉల్లి రైతుల‌కు గిట్టుబాటు ధర క‌ల్పించాలి : కోట్ల సూర్య ప్ర‌కాశ్ రెడ్డి

కర్నూల్ మార్కెట్ యార్డును మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ జాతీయ నాయకులు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి, కర్నూల్ సిపిఎం నేత జగన్నాథం బుధవారం సందర్శించారు. ఉల్లికి గిట్టుబాటు ధర లేక తల్లడిల్లుతున్న రైతులను పరామర్శించారు. మార్కెట్ లో సౌకర్యాలపై వారు రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నట్లు పేర్కొన్నారు. ఉల్లి సాగులో భాగంగా ఎకరానికి రూ.30 వేల నుంచి 50 వేలు ఖర్చు పెడుతున్న గిట్టుబాటు ధర రావడం లేదన్నారు. క్వింటాలు ఉల్లి ధర రూ.600 కూడా పలకడం లేదని రైతులు తన దృష్టికి తెచ్చారని కోట్ల పేర్కొన్నారు. ప్రభుత్వమే క్వింటాలు ఉల్లి రూ.4 వేలు చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈనాం పద్ధతిలో కొనుగోలు నుంచి రైతులు నష్టపోతున్నారని అన్నారు. బహిరంగ వేలం ద్వారా ఉల్లి కొనుగోలు చేయాలని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement