Sunday, May 5, 2024

ఫ్యాక్షన్ వద్దు అభివృద్ది ముద్దు.. జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ పల్లె నిద్ర

కర్నూలు, ప్ర‌భ‌న్యూస్ : పల్లెనిద్రలో భాగంగా జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ గురువారం రాత్రి కౌతాళం మండలం, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కామవరం గ్రామాన్ని సందర్శించారు. కామవరంలో గ్రామ సచివాలయం, ఆర్టీసి బస్టాండ్, అంగన్ వాడి సెంటర్ ను , రైతు భరోసా కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు. అనంతరం పల్లె నిద్ర లో భాగంగా గ్రామ ప్రజలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడారు. ఫ్యాక్షన్ జోలికి ఏవరు కూడా వెళ్ళవద్దన్నారు. పిల్లలను బాగా చదివించు కోవాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదన్నారు. గ్రామాభివృద్ది కి చర్యలు తీసుకుంటామన్నారు. మహిళలకు ఏల్లవేళల్లా అండగా ఉంటామన్నారు. దిశా యాప్ ను ప్రతి మహిళ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. ప్రజలకు పోలీసులు దగ్గర కావడానికి పల్లె నిద్ర కార్యక్రమం ఎంతోదోహదపడుతుందన్నారు ఈ కార్యక్రమంలో 2000మంది ప్రజలు పాల్గొన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కామవరం గ్రామంలో జంట హాత్యలకు గురై మృతి చెందిన బాధితుల కుటుంబాల ఇళ్ళకు వెళ్ళి జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ పరామర్శించారు.

బాధిత కుటుంబాలకు రావాలసిన పరిహారాల గురించి రెవిన్యూ శాఖ అధికారులతో మాట్లాడుతామన్నారు. అనంతరం కామవరం లోని మండల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో రాత్రి జిల్లా ఎస్పీ పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా
జిల్లా ఎస్పీ వెంట ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ , సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement