Sunday, April 21, 2024

Kurnool: పత్తికొండలో నాటుబాంబు కలకలం

క‌ర్నూలు జిల్లా పత్తికొండలో నాటు బాంబు కలకలం చోటుచేసుకుంది. ప‌త్తికొండ‌లో స్త్రీ శక్తి భవనం వెనకాల ఓ పొలంలో ఉన్న స్థానికులకు నాటు బాంబు కనిపించింది. ఒక్కసారిగా భయాందోళనకు గురైన వారు పోలీసుల‌కు స‌మాచార‌మిచ్చారు. పోలీసులు నాటు బాంబును స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే పొలంలో ఈ బాంబును ఎవరు పెట్టారు..? ఎందుకోసం ఇలా చేశారు..? దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా..? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఈ నాటు బాంబును పందుల వేటకు వాడే బాంబుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement