Friday, April 26, 2024

Knl: ఎల్లమ్మ గుట్ట తండా సర్పంచ్ మృతి

తుగ్గలి, ఫిబ్రవరి 24 (ప్రభ న్యూస్) : మండల పరిధిలోని ఎల్లమ్మ గుట్ట తండా సర్పంచ్ ఎల్లిబాయ్ (70) అనారోగ్యంతో శుక్రవారం మధ్యాహ్నం మృతిచెందారు. గత కొంతకాలం నుండి అనారోగ్యానికి గురికావడంతో ఆమె కర్నూల్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇప్పుడు తుదిశ్వాస విడిచారు. ఈమె మృతి పట్ల వైఎస్ఆర్సిపి నాయకులు తుగ్గలి మోహన్ రెడ్డి, తుగ్గలి చంద్రశేఖర్ రెడ్డి ,కడమకుంట్ల అమర్నాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ సునీత, మాజీ జెడ్పిటిసి నారాయణ నాయక్, జడ్పిటిసి పులికొండ నాయక్, పార్టీ మండల కన్వీనర్ జిట్టా నగేష్, సచివాలయం మండల కన్వీనర్ హనుమంతు, ఎంపీటీసీ ఆదిలక్ష్మి, మీటే తండ సర్పంచ్ సలహాదారుడు రాము నాయక్, తదితరులు సంతాపం తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement