Saturday, April 20, 2024

వైసిపి ఎమ్మెల్యేలు వెల్లంపల్లి, సామినేనిల మ‌ధ్య మాట‌ల యుద్ధం..

అమరావతి,ఆంధ్రప్రభ: వైసీపీ మంత్రులు, ఎమ్మె ల్యేల మధ్య సరిహద్దు తగాదాలు పొడచూపుతు న్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్‌ వర్సస్‌ ఎమ్మెల్యే వసంత కృష్ణప్ర సాద్‌ మధ్య వివాదాలు నడుస్తున్నాయి. తాజాగా మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, జగ్గయ్యపేట ఎమ్మె ల్యే సామినేని ఉదయభాను మధ్య మంగళవారం ఓ రేంజ్‌లో మాటల యుద్ధం సాగింది. ఏకవచన సంబో ధాలు, నువ్వెంతంటే నువ్వెంత అంటూ వారిద్దరు కార్యకర్తల సాక్షిగా వాదులాడుకోవడంతో పార్టీ శ్రేణు లు విస్మయానికి గురయ్యాయి. వివరాల్లోకి వెళితే విజయవాడ వైసీపీ అధ్యక్షులు బొప్పన భవకుమార్‌ జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే సామి నేని ఉదయభాను హాజరై శుభాకాంక్షలు తెరిగి వస్తు న్నారు. అదే సమయంలో వెలంపల్లి శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ కార్యాలయం లోపలకు వెళుతు న్నారు. వీరిద్దరు ఎదురుపడగానే ఒక్కసారిగా వాదు లాటకు దిగారు. నా నియోజకవర్గంలో కల్పించుకోవ డానికి నువ్వెవరు అంటూ వెలంపల్లి, సామినేనిని ప్రశ్నించడంతో వివాదం మొదలైనట్లు ప్రత్యక్షసాక్షు లు చెబుతున్నారు. మూడుపార్టీలు మారి వచ్చిన నీకే అంతుంటే పార్టీ ఆవిర్భావం నుంచి కష్టనష్టాలకోర్చి పనిచేస్తున్నాం. మాకెంత ఉండాలి అంటూ సామినేని ఎదురుదాడికి దిగినట్లు సమాచారం. నువ్వు మాజీ మంత్రివి అయినంత మాత్రాన నేనేం నెత్తిన పెట్టుకో వాల్సిన అవసరం లేదని.. నీ ప్రతాపం ఇంకెక్కడైనా చూపించు నా దగ్గర కాదంటూ సామినేని గట్టిగా కౌంటర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకదశలో ఇరువురు సంయమనం కోల్పోయి రాయడానికి వీల్లేని పదాలతో దూషించుకున్నట్లు భోగట్టా. అక్కడే ఉన్న ఓ కార్పొరేషన్‌ అధ్యక్షుడు సైతం వెలంపల్లి తీరును తప్పుబడుతూ తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

వివాదం ఇదీ
విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఆకుల శ్రీనివాస్‌ తన కుమార్తె వివాహాని సంబంధిం చిన పత్రికను సీఎం వైఎస్‌ జగన్‌కు అందించేందుకు ఎమ్మెల్యే సామినేని ఉద యభాను సహాయం కోరారు. దీంతో ఉదయభాను ఇటీవల ఆకుల శ్రీనివాస్‌ను తీసుకొని సీఎం వద్దకు వెళ్ళారు. తన కుమార్తె ఆహ్వా న పత్రిక అందించివచ్చారు. తన నియోజకవర్గానికి చెందిన శ్రీనివాస్‌ తనకు మాటమాత్రమైన చెప్ప కుండా సామినేని తో కల్సి సీఎంకు ఆహ్వానం అందించడం వెలంపల్లి ఆగ్రహానికి కారణమైనట్లు తెలుస్తోంది.
అయితే సామినేని ఉదయభాను, ఆకుల శ్రీని వాస్‌ ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీలో క లిసి పనిచేయడంతో పాటు ఇద్దరిది ఒకే సామాజిక వర్గం కావడంతో సామినేని సాయం కోరినట్లు తెలుస్తోంది. దీనిపై అలక పూనిన వెలంపల్లి, సామినేని కనబడగాను తన అక్క స్సు అంతా వెళ్లగక్కడం అదీ కార్యకర్తల సమక్షంలో కావడంతో వైసీపీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇరువురి మధ్య చోటు చేసుకున్న వివాదంపై సీఎం ఓకు ఫిర్యాదులు అందినట్లు అత్యంత విశ్వసనీ యంగా తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement