Wednesday, February 8, 2023

Breaking: శ్రీవారిని దర్శించుకుని వెళ్తుండగా రోడ్డుప్రమాదం.. నలుగురు భక్తులు మృతి

ఘోరరోడ్డుప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లా చంద్రగిరిలో చోటుచేసుకుంది. శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళుతున్న భక్తులు డివైడర్ ఢీకొనడంతో నలుగురు అక్కడకక్కడే బుధవారం మృతి చెందారు. మహారాష్ట్రకు చెందిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వెళుతుండగా చంద్రగిరి మండలం కల్ రోడ్డుపల్లి వద్ద కారు డివైడర్ ని డీకొంది.

- Advertisement -
   

ఈ ఘటనలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. చంద్రగిరి పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి రూయాకు తరలించారు. చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఎస్ వి మెడికల్ కళాశాలకు మృతదేహాన్ని తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement