Thursday, May 16, 2024

AP | సరైన సమయంలో వైద్యం అందక బాలిక మృతి.. కృష్ణా జిల్లాలో ఘ‌ట‌న‌

హనుమాన్ జంక్షన్ (ప్రభ న్యూస్): స‌రైన స‌మ‌యంలో వైద్యం అంద‌క బాలికి చ‌నిపోయిన ఘ‌ట‌న కృష్ణా జిల్లాలో ఇవ్వాల (శ‌నివారం) జ‌రిగింది. గన్నవరం నియోజవర్గం, బాపులపాడు మండలం, వీరవల్లి పరిధిలో ఈ ఘటన జరిగింది. నారాయణపురంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థిని అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందక చనిపోయింది.

ఇదిలా ఉండగా.. ఎన్నో సమస్యలకు నిలయంగా నారాయణపురం గ్రామం మారింది. రేపు జరుగబోయే బాలిక అంతిమ యాత్ర కార్యక్రమం ఎలా ఉంటుందో అని గ్రామ ప్రజలు ఆలోచిస్తున్నారు. కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్మశానానికి వెళ్లే దారిలో మొత్తం నీరు నిండిపోయి ఉంది. వర్షాకాలం వచ్చిన ప్రతిసారి ఎవరైనా చనిపోతే కాలువ నీటిలో మునుగుతూ మృతదేహాన్ని తీసుకువెళ్లాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడం లేదు.

ఎమర్జెన్సీ అయితే వైద్యం కష్టమే..
అత్యవసర పరిస్థితుల్లో హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంత గ్రామాలోని ప్రజలు సరైన వైద్య సదుపాయం లేక చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ లో నామమాత్రపు హాస్పటల్ లే కానీ అత్యవసర సమయంలో వైద్యం అందించే హాస్పటళ్లు లేవు. దీంతో సరైన సమయంలో వైద్యం అందక చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటోందని స్థానికులు చెబుతున్నారు.

ఈ మధ్య కాలంలోనే ఓ గర్భిణికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. కొంచెం సీరియస్ అయినా సరే తాము వైద్యం చేయలేమని కొన్ని హాస్పిటళ్లు తెగేసి చెబుతున్నాయి. దీంతో వైద్యం కోసం హాస్పిటళ్లకు వెళ్లిన వారి ప్రాణాలు గాల్లో కలుస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement