Monday, November 4, 2024

Breaking : మైలవరం రానున్న జ‌గ‌న్..ఏర్పాట్లను ప‌ర్య‌వేక్షించిన ఎమ్మెల్యే..అధికారులు..

మైలవరం ..ప్రభ న్యూస్ : మైలవరం ప్రాంత ప్రజల ఆశాజ్వోతి, విద్యా దాత ఎన్ఆర్ఐ లక్కిరెఢ్డి బాలిరెడ్డి అమెరికాలో మృతి చెందారు. బుధవారం నాడు ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన వెల్వడం తీసుకువస్తున్నారు. దాంతో ముందుగా లక్కిరెడ్డి బాలిరెడ్డి భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్దం మైలవరంలోని ఇంజనీరింగ్ కశాలలో ఉంచనున్నారు.బుధవారం మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి మైలవరం విచ్చేసి.. బాలిరెడ్డి మృతదేహనికి నివాళులర్పించ‌నున్నారు.జ‌గ‌న్ రాకను పురస్కరించుకుని హెలిప్యాడ్ ఇతర ఏర్పాట్లును బాలిరెడ్డి కుమారుడు ప్రసాద రెడ్డి , సోదరులు జయప్రకాష్ రెఢ్డి , అధికారులతో కలిసి ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పరిశీలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement