Friday, May 3, 2024

AP : దళితులపై దాడుల్లో ఏపీది మొదటి స్థానం…. కొలికపూడి

ఎన్టీఆర్ బ్యూరో, ప్రభ న్యూస్ః దళితులకు చదువు లేకపోవడానికి, ఉద్యోగం రాకపోవడానికి, నిరుద్యోగ యువతకు రుణాలు రాకపోవడానికి కారణం ముఖ్య మంత్రి జగన్‌ అని తిరువూరు టీడీపీ అభ్యర్ధి కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. తిరువూరు లోని ఆయన నివాసం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహిరంగ సభలలో నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్‌ ఎస్సీ, ఎస్టీలను ఆర్దికంగా దెబ్బతీశారన్నారు.

- Advertisement -

నేటి నుంచి మే 11వ తేదీ వరకు ప్రతి పల్లెలోని ఎస్సీ, ఎస్టీ కాలనీలలో దళిత ద్రోహి జగన్‌ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. వైసీపీ దళిత నాయకులలో మంత్రులు, ఎమ్మెల్యే, శాసనసభ స్థాయిలో ఉన్నవారు ఎవరైన ఐదేళ్ళలో ఎస్సీ, ఎస్టీలకు ఏమి చేశారో దళితులకు తిరువూరు, విజయవాడ లేదా అమరావతిలో బహిరంగ చర్చ పెట్టాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు జరిగిన నష్టాన్ని తాము వివరిస్తామన్నారు. ముఖ్యమంత్రి కాక ముందు పదేళ్ళు ప్రచారంలో దళితులు మా మేన మామలు అని చెప్పి, దళితుల ఓట్లు వేయించుకుని 151 సీట్లు సాధించుకుని ముఖ్యమంత్రి అయిన తరువాత దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యంగా విదాభివృద్ధి కొసం గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలు అన్నిటినీ రద్దు చేశారు.

మరో వైపు గత 5 సంవత్సరాలుగా దళుతుల మీద హత్య, అత్యాచారాలు, దాడులు జరిగాయన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత వారానికి నలుగు హత్యలు, ఆరు హత్యా ప్రయత్నాలు, మూడు అత్యాచారాల చప్పున సగటున రోజుకు ఆరు జరిగాయన్నారు. దక్షిణ భారత దేశంలో దళితులపై జరిగిన దాడులు, అనేక నేరాలలో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. జాతీయ నేర ఘణాంక సంస్థఅధికారికంగా ప్రకటించిందన్నారు. జగన్‌ రద్దు చేసిన 27 పథకాలలో విద్యారంగానికి సంబంధించి దాదాపు 8 పథకాలు ఉన్నాయన్నారు. అంబేద్కర్‌ విదేశీ విద్యాపథకాన్ని గతంలో చంద్రబాబు ప్రారంభించి దళితలతో పాటు అన్ని వర్గాలలో ఉన్న పేదల పిల్లలకు విదేశాలలో చదువుకునే అవకాశం కల్పించారన్నారు.

దానిని ఆపేసి విద్యాభివృద్ధికి గండి కొట్టారన్నారు. విద్యాభివృద్ధికి సంబంధించిన పథకాలు ఆపడం దళుతులకు తీరని నష్టమన్నారు. అన్ని కులాలతో పాటు దళితులకు అమ్మ ఒడి ఇస్తున్న ముఖ్యమంత్రి అమ్మ ఒడి పథకంతో పాటు దళితులకు ఏమి ఇస్తున్నారని ప్రశ్నించారు. అమ్మ ఒడి, చేయూత, పెన్షన్‌ వంటివి అన్ని కులాలకు వస్తున్నాయని… దళితులకు అదనగా ఒక్క రూపాయి ఇవ్వలెదన్నారు. గతంలో ప్రభుత్వాల అందరికి అమలు చేసే పథకాలతో పాటు దళితులకు ఎస్సీ, ఎస్టీ కార్పోరేషన్‌ల ద్వారా రుణాలు ఇచ్చేవారన్నారు. ఇత కులాలకు ఇచ్చేవి కాకుండా దళితులకు అదనంగా ఒక్క రూపాయి ఇచ్చారా అని ప్రశ్నించారు. సామాజికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి అదనంగా పథకాలు ఉండాలని రాజ్యాంగంలో ఉందని కాని జగన్‌ వాటన్నిటినీ నిలిపివేశారన్నారు.

బహిరంగ సభలలో నా ఎస్టీ, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పుకుంటూనే వీరందరిని గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్‌ ఆర్ధికంగా దెబ్బతీశారన్నారు. ఈ ఐదేళ్ళలో ఎంత మంది ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. 2.30 లక్షల ఏపీపీఎస్సీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. అవి ఇచ్చి ఉంటే ఎస్సీలకు 40 వేలు, ఎస్టీలకు 20 వేల ఉద్యోగాలు వచ్చుండేవి అన్నారు. ఇపుడు డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ యువత బతకడానికి కూలిపనులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఎస్సీ కారొ్పరేషన్‌కు ఒక్క రూపాయి ఇవ్వకపోగా ఇళ్ళ స్థలాల పేరుతొ గతంలో ప్రభుత్వాలు దళితులకు ఇచ్చిన 12 వేల ఎకరాల అ సైన్డ్‌ భూములు లాకున్నారన్నారు. దళితులకు రాష్ట్రంలో జగన్‌ చేసినంత మోసం ఇంకెవ్వరూ చేయలేదన్నారు. దళిత ద్రొహి జగన్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాలలోను అమలు చేయనున్నట్లు కొలికపూడి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement