Monday, April 12, 2021

ఎన్నిక‌ల‌కు అంతా సిద్ధం – ఆర్డీవో ఖాజావ‌లి…

గూడూరు – రేపు జరగనున్న జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల అన్ని ఏర్పాట్లు చేసినట్టు బందరు ఆర్డీవో ఖాజావలి అన్నారు. బుధవారం పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను .సందర్శిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గూడూరు మండలం మొత్తం ఓటర్ల సంఖ్య 41వేల 325 మంది ఉన్నారని, అందులో పురుషులు 20 వేల ఐదు వందల యాభై, స్త్రీలు 20573 ఉన్నారన్నారు మండలంలో మొత్తం పద్నాలుగు ఎంపిటిసి సెగ్మెంట్ లకు తరకాటూరు సెగ్మెంట్ ఏకగ్రీవం కాగా ,మండలంలో ఒక జడ్పిటిసి స్థానానికి 13 ఎంపీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నట్లు తెలిపారు. అందుకోసం 55 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వీటిలో సమస్యాత్మకమైన 17 అతి సమస్యాత్మకమైన 10 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఆయన తెలిపారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పద్మ, తాసిల్దార్ ఆర్. దుర్గాప్రసాద్, ఈ .ఓ .పి .ఆర్ .డి ఎం .డి. రాజా ఉల్లా తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News