Tuesday, April 30, 2024

Krishna River Board: ఇవాళ‌ కృష్ణా రివర్‌ బోర్డు సమావేశం… శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల అప్పగింతపై చర్చ…

ఇవాళ జ‌ల‌సౌదాలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కీలక సమావేశం కానుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల అప్పగింతపై చ‌ర్చించ‌నున్నారు. ఈ మేర‌కు ఏపీ, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులకు కేఆర్ఎంబీ లేఖ రాసింది.

బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాల నుంచి కార్పస్‌ ఫండ్‌ నిధుల విడుదలపై చర్చించనున్నారు. రెండు ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్ట్‌ను ఏపీ, నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అంటున్నారు. ముందు కృష్ణానదిలో వాటా తెల్చాలని టీ సర్కార్‌ పట్టుబడుతున్నారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం తాత్కాలిక నీటి కేటాయింపులు చేసింది. తాత్కాలికంగా తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులు చేసింది. నీటి పరివాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు చేయాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తుంది. నీటి కేటాయింపులు చేస్తేనే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement