Sunday, April 28, 2024

మైనర్‌ బాలిక కిడ్నాప్‌, అత్యాచారం.. నెల రోజుల తర్వాత వెలుగు చూసిన వైనం

ప్రభన్యూస్‌ :కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో 17 ఏళ్ల మైనర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి, అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి ఆదివారం మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం . మచిలీపట్నం ఆదర్శనగర్‌కు చెంది17 ఏళ్ల బాలిక నెల రోజుల క్రితం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో స్నేహితురాలు వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఇద్దరు యువకులు బైక్‌పై వచ్చి బలవంతంగా సమీపంలోని వంతెన కిందకి తీసుకెళ్లి హింసించి అత్యాచారం చేశారు.. ఆ తర్వాత రాత్రి పది గంటల ప్రాంతంలో ఆమెను వదిలిపెట్టారు. జరిగిన సంఘటనతో షాక్‌కు గురైన ఆ బాలిక ఇంటికి చేరుకుంది. ఆ షాక్‌ నుంచి తేరుకున్న ఆమె కుటు-ంబ సభ్యులతో కలిసి వెళుతుండగా మచిలీపట్నం శక్తి గుడి ప్రాంతంలో తనపై అఘాయిత్యానికి పాల్పడిన నారాయణ ఎదురుపడ్డాడు. వెంటనే ఆ విషయాన్ని కుటు-ంబ సభ్యులకు తెలియజేసింది. వెంటనే ఆ యువకుడిని పట్టు-కుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. రెండో నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం, కిడ్నాప్‌, తదితర 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నిందితులను శిక్షించాలంటూ పోలీస్‌ స్టేషన్‌ ముందు ఆందోళన..

బాధిత యువతి కుటు-ంబ సభ్యులు న్యాయం చేయాలంటూ, దోషులను కఠినంగా శిక్షించాలని ఆదివారం రాత్రి పోలీస్‌ స్టేషన్‌ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులు ఇంతవరకు రెండో నిందితుడిని పట్టు-కోలేదని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక బంధువులు కోరుతున్నారు.బాధిత కుటు-ంబ సభ్యులు ఆందోళనకు మాజీ మంత్రి, టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నంలో మహిళలపై వేధింపులు రోజు రోజుకూ పెరిగి పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అత్యాచార ఘటనకు సంబంధించి నిందితులను తక్షణమే అరెస్ట్‌ చేసి వెంటనే కోర్టులో హాజరు పర్చాలని డిమాండ్‌ చేశారు. గతంలో కూడా ఒక మహిళపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన జరిగిందని, భవిష్యత్తులో ఇటు-వంటి ఘటనలు చోటు-చేసుకోకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement