Wednesday, February 21, 2024

Flood – పొంగి పొర్లుతున్న కట్టలేరు… ..పలు గ్రామాలకు రాక పోకలు బంద్

గంపలగూడెం ప్రభ న్యూస్ – ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని గంపలగూడెం మండలం లోని కట్టలేరు పొంగిపొర్లుతోంది. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తిరువూరు నియోజకవర్గం పరిధిలో గడిచిన కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వరద నీరు భారీ ఎత్తున వస్తోంది. దీంతో గంపలగూడెం మండలం వినగడప కట్టేలేరు బ్రిడ్జి మీద రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది.

ప్రస్తుతం వరదనీటి ప్రవాహం అధికంగా ఉండడంతో వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు. గంపలగూడెం మండలం వినగడప – తోటమూల గ్రామాల మధ్య కట్టలేరు వాగుకు వరద నీరు పోటెత్తితోంది. ఈ నేపథ్యంలోవిజయవాడ, నూజివీడుతో పాటు శివారు 20గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement