ఎన్టీఆర్, ప్రభ న్యూస్ బ్యూరో : విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్న కనకదుర్గమ్మ వారి సేవలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. కనకదుర్గమ్మ ఆలయానికి కుటుంబ సమేతంగా వచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారం ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు.
- Advertisement -
అనంతరం అమ్మవారిని స్పీకర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితులు వీరికి ఆశీర్వచనం చేయగా.. ఆలయ ఈవో భ్రమరాంబ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ కర్నాటి రాంబాబు అమ్మవారి ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావు, వైదిక కమిటీ సభ్యుడు శంకర్ శాండిల్య, ఇతర అధికారులు ఉన్నారు.