Monday, April 29, 2024

లోకేష్ పాదయాత్రలో జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం

పీలేరు (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర లో దర్శనమిచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. అన్నమయ్య జిల్లా పీలేరులో పలుచోట్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం పేరుతో వెలిసిన నిలువెత్తు ఫ్లెక్సీ లు చర్చనీయాంశమయ్యాయి.. అన్న పెట్టిన పార్టీ అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాలన్నదే ఆ ఫ్లెక్సీల సారాంశం. వెంటనే రంగంలోకి దిగిన తెలుగుదేశం శ్రేణులు ఆ ఫ్లెక్సీ లను తొలగించడం మొదలుపెట్టారు. వాటిని ఎవరు ఏర్పాటు చేశారనే విషయం అంతుపట్టడం లేదని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి. కొందరు అధికార పార్టీ వారే చేయించి ఉంటారని ఆరోపించడం కనిపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement