Wednesday, May 1, 2024

High Court: చంద్రబాబు మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్‌

అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌ చేసింది. చంద్రబాబు ఆరోగ్య రీత్యా ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు లాయర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు.

మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై మంగళవారం నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి తెలిపారు. మెయిన్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ఎప్పుడనేది మంగళవారం నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement