Sunday, April 28, 2024

AP – వైసిపిలో మ‌రో వికెట్ డౌన్ … చంద్ర‌బాబుతో జంగా భేటి..

మాచ‌ర్ల – ఏపీలో అధికార పార్టీ నుంచి వలసలు కంటిన్యూ అవుతున్నాయి. రోజుకో నేత కూటమిలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికే చాలామంది వెళ్లిపోయారు… పోతున్నారు కూడా. ఈ జాబితాలోకి ఆ పార్టీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి కూడా చేరిపోయారు. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు తో ఆయన భేటీ అయ్యారు. పల్నాడుకు చెందిన వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఆయన కొడుకు కోటయ్య టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆ పార్టీలో తనకు జరిగిన అన్యాయం గురించి వివరించారు. అక్కడ ఉండలేనని, టీడీపీలో చేరేందుకు సిద్ధమేనని సంకేతాలు ఇచ్చారు. జంగా వెంట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఉన్నారు. రేపే మాపో గురజాలలో జరగనున్న ఎన్నికల శంఖారావం సభ వేదికగా అనుచరులతో కలిసి జంగా కృష్ణమూర్తి టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఇక అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సోమవారం రాజీనామా చేశారు. ఆ పార్టీ ప్రాధమిక సభ్యత్వంతోపాటు ఆ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్ష పదవికి సైతం ఆయన రాజీనామా చేసేశారు. ఆయన త్వరలో టీడీపీలో చేరనున్నారు. ఏప్రిల్ 5వ తేదీ లేకుంటే 6వ తేదీ పల్నాడు జిల్లాలో జరిగే కార్యక్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాల్గొనున్నారు. ఆయన సమక్షంలో జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరనున్నారు. మరోవైపు జంగా కృష్ణమూర్తి వర్గమంతా ముకుమ్మడిగా వైసీపీకి రాజీనామా చేసింది. వారు కూడా నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement