Friday, April 26, 2024

టిటిడిలో ధర్మారెడ్డిని కొనసాగిస్తే ఊరుకోం: జనసేన

తిరుమల తిరుపతి దేవస్థానంలో జెఈఓగా అడుగు పెట్టిన ధర్మారెడ్డి.. దేవస్థానంలో తిష్టవేశారని చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ విమర్శించారు. వైసిపి పాలనలో అధర్మారెడ్డిగా పేరు గడించి.. ప్రపంచవ్యాప్తంగా పవిత్రంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామిని సీఎం జగన్ కు తాకట్టు పెట్టాడని ఆరోపిచారు. వైసీపీ పాలనలోకి వచ్చాక టిటిడి ఆస్తులను అమ్మి సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించారని ఆరోపించారు. అలాగే రథసప్తమితో పాటు ఆర్జిత సేవ తదితర కైంకర్యాలు, ఏకాంత సేవను కూడా రద్దు చేసి శ్రీవారి దర్శన సమయాన్ని పెంచి వ్యాపార కోణంలో ఆధ్యాత్మికత భక్తి భావాలు సన్నగిల్లేలా నేటి టీటీడీ పాలకమండలి వ్యవహరిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

ధర్మారెడ్డిని టీటీడీతో పాటు ఎస్వీబీసీ,  వేదిక్ యూనివర్సిటీ తదితర సంస్థలలో కూడా అధిపతిగా వ్యవహరించేలా కిరీటాన్ని పెట్టి వైసీపీకి దేవస్థానాన్ని దోచిపెట్టేలా ప్లాన్ చేశారని మండిపడ్డారు. అతి పవిత్రమైన తిరుమల ప్రసాద రుచిని పూర్తిగా తగ్గించి ప్రసాదం రేట్లు పెంచారని విమర్శించారు. ఈ నెల 14వ తేదీకి ధర్మారెడ్డి పదవీకాలం ముగుస్తుందని, తరువాత టిటిడిలో ధర్మారెడ్డిని కొనసాగిస్తే ఊరుకోమని హెచ్చరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement