Tuesday, April 16, 2024

ఆ భూములు ఇవ్వండి – రైల్వే శాఖ మంత్రికి జ‌గ‌న్ లేఖ‌

అమరావతి : విజయవాడ రాజ‌రాజేశ్వ‌రిపేట‌లో రైల్వే ఆధీనంలో ఉన్న భూములను రాష్ట్రానికి బదలాయించాలని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌ కేంద్ర రైల్వేమంత్రి పీయూష్‌ గోయల్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు గురువారం లేఖ రాశారు. రాజరాజేశ్వరిపేటలో ఉన్న రైల్వే భూములకు బదులుగా అజిత్‌సింగ్‌నగర్‌ వద్ద ఉన్న 25 ఎకరాల భూమిని రైల్వేకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఆ భూమిని భూమిని రైల్వే, రెవెన్యూ బృందాలు పరిశీలించాయని తెలిపారు. కార్పొరేషన్‌ పరిధిలోని రాజరాజేశ్వరిపేట ప్రాంతంలో ఉన్న భూముల్లో 800 కుటుంబాలు 30 ఏళ్లుగా నివసిస్తున్నారన్నారు. ఈ భూమి క్రమబద్దీకరణకు దశాబ్దాల నుంచి విజ్ఞప్తి చేస్తున్న చర్యలు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, రైల్వే శాఖకు ఉపయోగంలో లేని ఆ భూమిని రాష్ట్రానికి బదలాయించాలని విజ్ఞప్తి చేశారు. భూమికి బదులుగా ఇస్తామన్న భూమి సైతం సమాన విలువైందని, రైల్వేకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement