Monday, October 14, 2024

Jagan tour – కర్నూలు జిల్లా సర్పంచుల ముందస్తు అరెస్ట్…

కర్నూలు – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళ వారం ఉమ్మడి కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా సర్పంచుల ముందస్తు అరెస్టు చేశారు.పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరిలించారు.సర్పంచుల సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రిని కలిసేందుకు అవకాశం ఇవ్వాలని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బిర్రు ప్రతాప రెడ్డి కోరగా అందుకు పోలీసులు తిరస్కరించారు. దీంతో ముఖ్య మంత్రి పర్యటనను అడ్డుకుంటామని సర్పంచుల సంఘం అధ్యక్షుడు ప్రకటించారు.దీంతో పోలీసులు వారిని ముందస్తుగా అరెస్టు చేశారు.

సమస్యలు పరిస్కారిoచాలని కోరితే సర్పంచుల ను అరెస్టు చేయడం అప్రాజస్వామికమన్నారు. అరెస్టుల వల్ల ఉద్యమాన్ని ఆపలేరనీ ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ ఛాంబర్ అధ్యక్షులుబిర్రు ప్రతాపరెడ్డి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement