Thursday, May 9, 2024

నేడు జగన్ గుడివాడ పర్యటన – టిడ్కో ఇళ్లు పంపిణీ

గుడివాడ శివారులోని మ‌ల్లాయ‌పాలెంలో అతిపెద్ద హౌసింగ్ క్లస్టర్‌ను నిర్మించింది ఏపీ ప్రభుత్వం. టిడ్కో ద్వారా నిర్మించిన ఈ ఇళ్లను ఇవాళ సీఎం జ‌గ‌న్ ప్రారంభించి ల‌బ్దిదారుల‌కు అందించనున్నారు. గుడివాడ మండలం మల్లాయపాలెంలో 77.46 ఎకరాలలో ఒకే చోట 8,912 టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తి చేసి రాష్ట్రంలోనే అతిపెద్ద లే అవుట్‌గా రూపుదిద్దింది ప్రభుత్వం. తొలి విడతలో 3, 296 ఇళ్లు నిర్మాణం కాగా రెండో విడతలో 5,616 ఇళ్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. వీటిలో 300, 365, 430 చదరపు అడుగుల ఇళ్లు ఉన్నాయి..

మరోవైపు సీఎం పర్యటన నేపథ్యంలో సభా ప్రాంగణంతో పాటుగా లే అవుట్‌లో ఏర్పాట్లన్ని పూర్తి చేశారు వైసీపీ నాయకులు. ఈ మేరకు ఉద‌యం తాడేప‌ల్లి నివాసం నుంచి బ‌య‌లుదేరి మ‌ల్లాయ‌పాలెం లే అవుట్‌కు చేరుకొన్నారు జగన్‌. హెలిపాడ్ నుంచి టిడ్కో ఇళ్ల సముదాయానికి చేరుకొని ఫ్లాట్లను పరిశీలిస్తున్నారు. అనంతరం లేఅవుట్లో ఏర్పాటు చేసిన వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి, బహిరంగ సభలో పాల్గొంటారు. ఉద‌యం 11.05 గంటల నుంచి 11.50 గంటల వ‌ర‌కూ బ‌హిరంగ స‌భ‌లో ప్రసంగించిన త‌ర్వాత మధ్యాహ్నం 12: 40 గంటలకు పర్యటన ముగించుకొని తాడేపల్లి నివాసానికి బయలుదేరుతారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement