Sunday, May 5, 2024

నిర్ల‌క్ష్యంతోనే త‌ర‌చు ముఖ్య‌మంత్రి హెలికాప్ట‌ర్ లో సాంకేతిక లోపాలు..

అమరావతి, ఆంధ్రప్రభ:ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రయాణించాల్సిన విమానాలు, హెలికాఫ్టర్లు తరచూ సాంకేతిక లోపాలకు గురౌతు న్నాయి. ఇప్పటికే పలుమార్లు తాడేపల్లి నుంచి గన్నవరానికి, అక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లే సమయంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రయా ణాలు ఆలస్యం కావడమో లేక రద్దు కావడం వంటి పరిణామాలు జరిగాయి. ఇవి మరువకముందే బుధ వారంమరోసారి అనంతపురం జిల్లాలోని నార్పల లో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని పుట్టపర్తికి బయలుదేరే సమయంలో మళ్లీ ఇలాంటి పరిస్ధితే తలెత్తింది. ఆయన నార్పల నుండి పుట్టపర్తి విమానాశ్రయానికి వెళ్లేందుకు అధికారులు ఏర్పాటు చేసిన హెలీకాఫ్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో సీఎం జగన్‌ రోడ్డు మార్గం ద్వారా పుట్టపర్తికి చేరుకుని అక్కడ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకోవాల్సిన పరిస్థితి నెల కొంది.

సహజంగా వీవీఐపీలు ప్రయాణించే విమా నాలు, హెలికాప్టర్లకు ప్రత్యేక ఎస్‌ఓపీ ఉంటుంది. ముందుగానే అన్ని రకాలుగా ఆ వాహనాన్ని వివిధ కోణాల్లో తనిఖీలు నిర్వహించి అంతా ఓకే అనుకు న్నాకే ప్రయాణానికి అనుమతిస్తారు. వాహన ఫిట్‌నెస్‌ తోపాటు వాతావరణం కూడా అనుకూలించాల్సి ఉంటుంది. ఒక వేళ వాహనం ఫిట్‌గానే ఉన్నా వాతా వరణం అనుకూలించకపోతే ప్రయాణానికి అనుమ తించరు. కానీ, ఇటీవలికాలంలో సీఎం జగన్‌ ప్రయా ణిస్తున్న విమానంగానీ, హెలీకాఫ్టర్‌గానీ తరచూ సాంకేతిక లోపాలకు గురవతుండటం పార్టీ నేతలు, జగన్‌ అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. వీవీఐపీ ప్రయాణించే వాహనాలను సక్రమంగా తనిఖీ చేయడంలో అధికారులు ఎందుకు విఫలం చెందుతున్నారన్న అనుమానాలను పార్టీ కేడర్‌ వ్యక్తం చేస్తోంది. ఒకటికాదు..రెండు కాదు.. మూడోసారి కూడా ఇదే తరహాలో జరగడంతో కేడర్‌ ఇప్పుడు అనేక సంశయాలు లేవనెత్తుతోంది.

గతంలో రెండు సార్లు
గతంలో ఆయన ఢిల్లి పర్యటనకు వెళ్లే సందర్భంలో రెండు సార్లు విమానంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఒకసారి ఆయన ప్రయాణిస్తున్న విమానం గాల్లోకి వెళ్లాక 15 నిమిషాలు ప్రయాణించాక సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్‌ తిరిగి గన్నవరం విమానాశ్రయానికి తీసుకొచ్చి సురక్షితం గా ల్యాండ్‌ చేశారు. అప్పుడు కూడా సాంకేతిక లోపాన్ని సరిచేసి గంట తరువాత సీఎం జగన్‌ ఢిల్తీ బయలుదేరి వెళ్లారు. అది మరువకముందే రెండో సారి ఆయన ఢిల్లి పర్యటన సందర్భంగా కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. తాడేపల్లి నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయన విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో వెనుదిరిగి ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. మరుసటిరోజు ఆయన తన ఢిల్లి పర్యటనకు వెళ్లారు. తాజాగా బుధవారం అనంతపురం జిల్లా శింగనమలలోని నార్పలలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు- చేసిన జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి జగన్‌ హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి సీఎం జగన్‌ పుట్టపర్తికి వెళ్లాల్సి ఉంది. దీంతో అధికారులు కూడా ఛాపర్‌ ను సిద్ధం చేశారు. కానీ సాంకేతిక లోపం ఏర్పడినట్లు- చివరి నిమిషంలో గుర్తించారు. దీంతో జగన్‌ హెలికాప్టర్‌ ప్రయాణాన్ని రద్దు చేసుకుని రోడ్డు మార్గం ద్వారా పుట్టపర్తికి వెళ్లారు.

మళ్లి మళ్లి పునరావృతం అవుతున్నా..
గతంలోనూ పలుమార్లు సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న ఛాపర్లు మొరాయించాయి. దీంతో సీఎం జగన్‌ ప్రయాణాల్లో మార్పులు కూడా చోటు- చేసుకున్నాయి. ఆ తర్వాత సాంకేతిక సమస్యల్ని సరిదిద్ది ప్రయాణాలకు సిద్ధం చేస్తున్నారు. అయినా మళ్లీ మళ్లీ సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం స్ధాయి వ్యక్తి ప్రయాణించే చాపర్ల విషయంలో అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. వీఐపీలు ప్రయాణించే చాపర్లను ప్రయాణాలకు సిద్ధం చేసే విషయంలో ఎస్‌ఓపీ ఉంటు-ంది. అలాగే ముందుజాగ్రత్తలు కూడా తీసుకుంటారు. కానీ ఇక్కడ అవేవీ పట్టించుకోవడం లేదని తాజా ఘటనలు రుజువు చేస్తున్నాయి.

- Advertisement -

మొరాయించిన హెలికాప్టర్ రోడ్డు మార్గాన పుట్టపర్తికి సీఎం
శ్రీ సత్యసాయి విద్య, ప్రభ న్యూస్‌:ముఖ్యమంత్రి హెలికాప్టర్‌ సాంకేతి క కారణాలతో మొరాయించింది. నార్పలలో విద్యాదీవిన కార్యక్రమా నికి హాజరై న ముఖ్యమంత్రి తిరుగుప్రయాణంలో హెలికాప్టర్‌ మొరాయించడంతో రోడ్డు మార్గాన పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బుధవారం ఉదయం పుట్టపర్తి విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రి హెలికాప్టర్లో నార్పలకు బయలుదేరి వెళ్లారు. నార్పలలో కార్యక్రమం ముగిసిన తర్వాత తిరిగి పుట్టపర్తి చేరుకోవాల్సి ఉంది. హెలికాప్టర్‌ మొరాయించింది. ఫలితంగా రోడ్డు మార్గాన పుట్టపర్తి విమానాశ్రయాకి చేరుకున్నారు. అప్పటికప్పుడు రెండు జిల్లాల పోలీసులు ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు మార్గాన ప్రత్యేక భద్రత ఏర్పాట్లు- చేశారు. నార్పల నుంచి బత్తలపల్లి ధర్మవరం కొత్తచెరువు మీదుగా పుట్టపర్తి విమానాశ్రయానికి ముఖ్యమంత్రి సాయంత్రం నాలుగు గంటల 40 నిమిషాలకు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గాన వస్తున్నారని సమాచారం అందడంతో వైకాపా నాయకులు కార్యకర్తలు, ముఖ్యమంత్రి ప్రయాణించే రోడ్డు కూడళ్లకు చేరుకున్నారు. మండల కేంద్రమైన కొత్తచెరువులోని నెహ్రూ సర్కిల్లో ముఖ్యమంత్రి వాహనం నిలుపుతారని ఆశతో వైకాపా నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కానీ ముఖ్యమంత్రి వాహన శ్రేణి నిలపకుండా పుట్టపర్తికి వెళ్లిపోయింది. ఆ తర్వాత హెలిపాడ్‌ వద్దకు చేరుకుని హెలికాప్టర్‌లో విజయవాడకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అప్పుడు కూడా మొరాయించింది. సాంకేతిక లోపాన్ని సరిదిద్దేందుకుపైలట్లు విఫలయత్నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement