Tuesday, April 16, 2024

అంత‌ర్జాతీయ వేదిక‌పై తెలుగు జెండా రెప‌రెప‌లు – ఆర్ఆర్ఆర్ టీమ్ కు జ‌గ‌న్ శుభాకాంక్ష‌లు..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ట్విట్టర్ ద్వారా అస్కార్ అవార్డు గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ టీమ్ ను అభినందించారు.. “తెలుగుజెండా ఎగురుతోందని అన్నారు. మన తెలుగు పాటకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించడం పట్ల ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణిలు ఈ ఘన విజయానికి అర్హులని అన్నారు. వీరితో పాటు పాట రచయిత చంద్రబోస్, గాయకులు రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, ఇతర టీమ్ సభ్యులకు అభినందనలు ” తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement