Friday, May 3, 2024

ఈబిసి మ‌హిళ‌ల కోసం మ‌రో కొత్త ప‌థ‌కం… క్యాబినేట్ ఆమోదం..

అమ‌రావ‌తి – ఈబిసి మ‌హిళ‌ల కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో వినూత్న పథకాన్ని రూపొందించారు. ఈబీసీ మహిళలకు ఆర్థిక భరోసా కల్పించే నూతన ‘ఈబీసీ’ పథకానికి రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా ఈబీసీ మహిళలకు మూడేళ్లలో రూ.45 వేల ఆర్థికసాయాన్ని ప్రభుత్వం అందించనుంది. తాడేప‌ల్లిలోని ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన క్యాబినేట్ బేటిలో ప‌లు నిర్ణ‌యాల‌కు ఆమోద‌ముద్ర వేశారు. ఈబీసీ నేస్తం పేరుతో అమలు చేయ‌నున్న ఈ ప‌థ‌కం 45 ఏళ్ల నుంచి 60 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న మహిళలకు వర్తించనుంది. ఇక అమరావతికి సంబంధించి ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయడానికి ఏఎం, ఆర్డీయేకు రూ. 3వేల కోట్లకు బ్యాంక్ గ్యారంటీ ప్రభుత్వం ఇచ్చే ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది. ఇప్పటికీ ప్రారంభంకానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌లో అభిప్రాయం పడింది. అలాగే నవరత్నాలు అమలు క్యాలెండర్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ఇళ్లను 300 చదరపు అడుగులలోపు ఉంటే.. రూపాయికే లబ్ధిదారులకు ఇల్లు ఇచ్చేందుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. వచ్చే ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు పథకాల అమలుకు మంత్రిమండలి అంగీకారం తెలిపింది. 5.8 కోట్ల మంది లబ్ధిదారులకు అందించే పథకాలను క్యాలెండర్‌గా రూపొందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement