Friday, April 19, 2024

ఏపీలో రేపటి నుండి ఇంటర్‌ పరీక్షలు..

అమరావతి,ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌లో నేటి నుండి ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమౌతున్నాయి. సెకండ్‌ లాంగ్వ్‌జ్‌ పేపర్‌ 1తో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్ధులకు మంగళవారం నుండి పరీక్షలు మొదలౌతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటలకు పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షలు మొదటి సంవత్సరం విద్యార్ధులకు ఏప్రిల్‌ మూడో తారీఖుతో, రెండో సంవత్సరం విద్యార్ధులకు ఏప్రిల్‌ నాలుగో తారీఖుతో ముగుస్తాయి. విద్యార్ధులు గంటకు ముందుగా పరీక్ష హాలుకు చేరుకోవాల్సి ఉంటుంది.

మొబైల్‌ ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, పర్సనల్‌ కంప్యూటర్ల లాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను వేటినీ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పరీక్షలు సిసి టీవీల పర్యవేక్షణలో జరుగుతాయి. ఎగ్జామ్‌ సెంటర్‌కు దగ్గరల్లో ఉన్న జిరాక్స్‌ సెంటర్లన్నింటినీ మూసివేయించారు. పరీక్ష కేంద్రం వరకు ఆర్టీసి బస్సులను నడపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. పరీక్ష కేంద్రాల్లో విద్యార్ధులకు అవసరమైన మంచినీళ్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకేట్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్లను ఉంచుతున్నారు.


ఏర్పాట్లు పరిశీలించిన ప్రవీణ్‌ ప్రకాశ్‌..

నేటి నుండి జరగున్న ఇంటర్మీడియట్‌ ధియరీ పబ్లిక్‌ పరీక్షల ఏర్పాట్లును పరిశీలించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ సోమవారం ఉదయం విజయవాడ కృష్ణలంకలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్ష కేంద్రంలో పరీక్షల నిర్వహణ కోసం విద్యార్ధులకు కేటాయించిన అన్ని గదులు, ఫర్నిచర్‌, టాయిలెట్స్‌, సిీసీ టీవీ కెమెరాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఎండల తీవ్రత పెరుగుతున్న మంచినీళ్లు, ఫస్ట్‌ ఎయిడ్‌ అందుబాటులో ఉంచాలని చెప్పారు. పక్కనే ఉన్న ఎపిఎస్‌పిడిసిఎల్‌ సబ్‌ స్టేషన్‌ను సందర్శించి పరీక్ష సమయంలో కరెంట్‌ సరఫరాలో ఇబ్బంది లేకుండా ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement