Saturday, May 4, 2024

ఒంటిమిట్టలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ..

కడప, ప్రభన్యూస్‌ : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఏప్రిల్‌ 10 నుండి 18వ తేదీ వరకు జరుగనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు ఈనెల 9న శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరగనుంది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు వ్యాసాభిషేకం, ఆరాధన, అర్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అర్చకులు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహిస్తారు. అలాగే 10న ధ్వజారోహణం, 10న ఆదివారం ఉదయం 8 నుండి 9 గంటల మధ్య వృషభ లగ్నంలో ధ్వజారోహణం జరుగనుంది. సాయంత్రం 4 నుండి రాత్రి 7 గంటల వరకు పోతన జయంతి, కవి సమ్మేళనం, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు శేష వాహనసేవ నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు : 10న ఆదివారం ధ్వజారోహణం, పోతన జయంతి, శేషవాహనం.. 11న సోమవారం వేణుగాన అలంకారం, హంస వాహనం, 12న మంగళవారం వటపత్రశాయి అలంకారం, సింహ వాహనం 13న బుధవారం నవనీతకృష్ణ అలంకారం, హనుమత్సేవ, 14 న గురువారం మోహినీ అలంకారం, గరుడసేవ, 15న శుక్రవారం, శివధనుర్భంగాలంకారం, శ్రీ సీతారాముల కల్యాణం గజవాహనం, 16న శనివారం రథోత్సవం, 17న ఆదివారం కాళీయమర్ధన అలంకారం, అశ్వవాహనం.. 18న సోమ వారం చక్రస్నానం, ధ్వజావరోహణం, 19న మంగళవారం పుష్పయాగం నిర్వహించనున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement