Friday, October 11, 2024

Vizag: తుపాను ప్రభావం.. విశాఖ నుంచి 23 విమానాలు రద్దు

విశాఖపట్నం: మిగ్‌జాం తుపాను ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ తెలిపారు. ఈమేరకు విశాఖ నుంచి 23 విమానాలు రద్దు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

‘‘విమానాశ్రయం పూర్తిస్థాయిలో ఆపరేషన్‌లో ఉంచుతున్నాం. అత్యవసర సర్వీసులు, మళ్లింపు కోసం ఏటీసీ 24 గంటలూ పని చేస్తుంది. రన్‌వే నవీకరణ పనుల వల్ల రాత్రి 8 వరకే విమానాశ్రయంలో రాకపోకలకు అనుమతి ఇస్తున్నాం’’ అని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement