Sunday, May 5, 2024

ముఖ్య‌మంత్రి అవుతానంటే మూడు పెళ్లిళ్లు చేసుకుంటా – గుడివాడ అమ‌ర్నాథ్

విశాఖ‌ప‌ట్నం .. మూడో,నాలుగో పెళ్లిళ్లు చేసుకుంటే ముఖ్య‌మంత్రి అయ్యే యోగం ఉందంటే తాను కూడా అన్ని పెళ్లిళ్లు చేసుకుంటాన‌ని మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ జ‌న‌సేనానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ కు కౌంట‌ర్ ఇచ్చారు.. విశాఖ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ, ఈసారి కూడా గెలవలేనని ముమ్మిడివరంలో పవన్‌కు జ్ఞానోదయం అయిందని అన్నారు. ఉపవాసాలు చేస్తేనో, నలుగురిని పెళ్లి చేసుకుంటేనో, నలుగురిని తిడితేనో ముఖ్యమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు.

‘‘నాకు ఉప ముఖ్యమంత్రి కావాలని ఉంది. నేనూ 15 రోజులు ఉపవాసాలు చేస్తాను. అయిపోతానా? ఇవన్నీ కాదు కదా.. ఒక లీడర్‌‌కు కావాల్సిందేంటి? నిబద్ధత, డెడికేషన్, స్థిరత్వం, సహనం ఉండాలి” అని అన్నారు. ‘‘అభిమానులు ఉన్నారు. సినీ నటుడిగా చరిష్మా ఉంది. కాపు కులంలో పుట్టారు కాబట్టి.. అది కూడా కలిసి వస్తుంది. నిజంగా వీటన్నింటినీ వాడుకోవాలని అనుకుంటే. దానికి అనేక రకాల దారులు ఉన్నాయి. డెడికేషన్ ఉండుంటే.. కనీసం ఎమ్మెల్యే అయినా అయ్యే వారేమో” అంటూ ప‌వ‌న్ ను ఎత్తిపొడిచారు. ‘‘ప్రత్తిపాడు వచ్చి ఎమ్మెల్యే కావాలని అంటారు.. పిఠాపురం వచ్చి ముఖ్యమంత్రిని చేయమని అంటారు.. ముమ్మిడివరం వచ్చి ఈ సారి గెలవకపోయినా కలిసి పోరాటం చేయాలని అంటారు” ప‌వ‌న్ క‌ల్యాణ్.. అని పేర్కొంటూ ఆయ‌న ఎప్పుడ ఏం మాట్లాడ‌తారో ఆయ‌న‌కే తెలీయ‌ద‌ని, ఈసారికూడా జ‌న‌సేనానికి ఎమ్మెల్యే యోగం లేద‌ని గుడివాడ భ‌విష్య‌వాణి వినిపించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement