Monday, April 29, 2024

Atrocious: పుట్టింటికి వెళ్లోద్ద‌న్న భ‌ర్త‌…ప్రాణాలు తీసుకున్న ఇల్లాలు

భ‌ర్త పుట్టింటికి వెళ్లోద‌న్న పాపానికి ఓ ఇల్లాలు దార‌ణానికి ఒడిగ‌ట్టింది. క్ష‌ణాకావేశంలో త‌న‌తో స‌హా త‌న కుటుంబానికి ఎలుక‌ల మందు క‌లిపిన టీని అందించింది. చివ‌రికి తానే అనంత‌లోకాల‌కు వెళ్లింది. ఈ దారుణ సంఘటన పల్నాడు జిల్లా… మాచర్ల మండలం నారాయణరెడ్డి పురం తండాలో చోటుచేసుకుంది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా మాచర్ల మండలం నారాయణపురం తండాకు చెందిన రవి నాయక్, వసంతకు పన్నేండు ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి నలుగురు మగ పిల్లలున్నారు. చివరి ఇద్దరి పిల్లలు కవలపిల్లలు. వీరిలో ముగ్గరు పిల్లలు వీరి వద్దే ఉండగా రెండో సంతానమైన కార్తీక్ ప్రకాష్ అమ్మమ్మ వాళ్ల ఇంట్లో పెరుగుతున్నాడు. అయితే కుటుంబం పెద్దది కావడంతో రవి నాయక్ హైదరాబాద్ లో నివాసం ఉంటూ ఆటో నడుపుతున్నాడు. వారం, పది రోజులకొకసారి ఇంటికి వచ్చి వెలుతుంటాడు. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితం రవి నాయక్ నారాయణపురం తండా వచ్చాడు.

హైదరాబాద్ తిరిగి వెల్దామనుకుంటున్న సమయంలోనే వసంత తన పుట్టిల్లైన నల్గొండ జిల్లా నర్సాపూర్ వెళ్లి వస్తానని రవి నాయక్ తో చెప్పింది. అయితే రవి నాయక్ అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు వద్దని వారించాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటిలానే నిద్ర లేచిన వారందరికి వసంత టీ పెట్టి ఇచ్చింది. ముగ్గురు పిల్లలతో పాటు రవి, వసంతలు కూడా టీ సేవించారు. అయితే సాయంత్రం అయ్యే కొద్దీ పిల్లలు వాంతులు మొదలయ్యాయి. దీంతో పిల్లలను వెంటనే మాచర్ల ఆసుపత్రికి తరిలించారు. అక్కడ నుండి నర్సరావుపేట తరలిస్తుండగా ఒక బాబు చనిపోయాడు. మరొ ఇద్దరిని సోమవారం హైదరాబాద్ తరలిస్తుండగా ఒకరు చనిపోగా, అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరొక బాబు చనిపోయాడు. ముగ్గురు పిల్లలు చనిపోగా రవి నాయక్, పరిస్థితి విషమంగా ఉంది. రవి నాయక్ హైదరాబాద్ లోని ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, వసంత గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతూ చనిపోయింది. భార్యాభర్తల మధ్య చిన్న వివాదంతో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోవటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమారుల చావుకు కారణమైన తల్లి వసంతా భాయి మీద హత్య కేసు నమోదు చేసిన పోలీసులు… పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement