Sunday, May 5, 2024

AP | జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు… ఏపీ కేబినెట్‌ ఓకే

అమరావతి, ఆంధ్రప్రభ: జర్నలిస్టులకు ఇళ్లస్ధలాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అక్రిడేటెడ్‌ జర్నలిస్టులకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు కేటాయించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి అంగీకారం తెలిపింది. సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల మంత్రిమండలి సభ్యులు పలువురు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డిని కలుసుకుని హర్షామోదం తెలిపారు.

సమాచార, పౌర సంబంంధాలశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, డిప్యూటీ సీఎంలు బూడి ముత్యాలనాయుడు, కే నారాయణస్వామి, అంజాద్‌బాషా, హోంమంత్రి తానేటి వనిత, పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, పశు సంవర్థకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, సాంఘిక సం క్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, గృహనిర్మాణ మంత్రి జోగి రమేష్‌, కేవీ ఉషశ్రీచరణ్‌ తదితరులు సీఎం జగన్‌ను దుశ్శాలువతో సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement