Friday, May 10, 2024

ఇళ్ల నిర్మాణ ప‌నులు వేగ‌వంతం చేయాలి.. సీఎం జ‌గ‌న్

రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జ‌గ‌న్ మాట్లాడుతూ… అన్ని రకాల పనులకు నిధులు సక్రమంగా విడుదలవుతున్నాయని, త్వరగా బిల్లులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జగన్‌ ఆదేశించారు. విశాఖలో 1.24 లక్షల ఇళ్ల నిర్మాణ పనులకు అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నామన్నారు.

అక్టోబర్ నెలాఖరుకల్లా ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఆప్షన్‌ త్రీ కింద ఎంపిక చేసిన ఇళ్ల నిర్మాణాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 15-20 రోజుల్లో మొత్తం 1.4 లక్షల ఇళ్లు సిద్ధమవుతాయని అధికారులు తెలిపిన టిడ్కో ఇళ్ల నిర్మాణంపై కూడా సీఎం జగన్ చర్చించారు. ఈ సమీక్షలో ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ చైర్మన్‌ డీ దొరబాబు, సీఎస్‌ సమీర్‌ శర్మ, గృహనిర్మాణ శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్షి, ఇంధన శాఖ స్పెషల్‌ సీఎస్‌కే విజయ్‌ ఆనంద్‌, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్‌, ఏపీఎస్‌హెచ్‌సీఎల్‌ ఎండీ ఎన్‌సీసీఎల్‌ భరత్‌ గుప్తా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement