Thursday, April 25, 2024

Breaking | ఈదురు గాలుల‌తో భారీ వ‌ర్షం.. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, చెట్లు

చేజర్ల, (ప్రభ న్యూస్): ఒక్కసారిగా వాతావరణంలో త‌లెత్తిన మార్పులు వల్ల విపరీతమైన ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం తిమ్మాయపాలెం.ఎన్వి కండ్రిక. చేజర్ల గ్రామాలలో ఆదివారం సాయంత్రం విద్యుత్ స్తంభాలు, పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. రోడ్డుకు అడ్డంగా ప‌డిపోవడంతో రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగింది.

స్థంబాలు ప‌డిపోయిన‌ప్పుడు విద్యుత్ నిలిచిపోవ‌డంతో రహదారిపై వెళుతున్న వారు ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు. అదేవిధంగా ఏటూరు కండ్రీక వద్ద ప్రధాన రహదారిపై తాటిచెట్టు కూలడం వల్ల అరగంట పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గొల్లపల్లి లో చర్చి పై కప్పు రేకులు పూర్తిగా గాలికి లేచిపోయాయి అధికారులు స్పందించి విద్యుత్ స్తంభాల మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement