Tuesday, May 14, 2024

Supreme Court: ఇవాళ చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచార‌ణ

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై ఇవాళ‌ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మొదట మధ్యంతర బెయిల్‌, ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ను మంజూరు చేసింది.

కాగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఏపీ సీఐడీ ఆశ్రయించింది. సాక్ష్యాధారాలు సమర్పించినా సరే తమ వాదన పరిగణలోకి తీసుకోలేదని సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఇక, ఈ కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఇవాళ విచారణ జరపనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement