Friday, March 1, 2024

Health Bulletin – చంద్ర‌బాబుకు స్కిన్ ఎల‌ర్జీ…… చ‌ల్ల‌టివాతావ‌ర‌ణం అవ‌స‌రం – వైద్యుల నివేదిక స్ప‌ష్టం ..

రాజ‌మండ్రి – స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు కు శనివారం నాడు ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక నివేదిక అందించారు.. చంద్రబాబు ఛాతీ, చేతులు, మెడ, గడ్డం, వీపు తదితర శరీరభాగాల్లో దద్దుర్లు, స్కిన్‌ అలర్జీ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈనెల 12న సాయంత్రం 4.30గంటలకు జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అదే రోజు సాయంత్రం 5 నుంచి 5.30గంటల వరకు పరీక్షించి.. జి.సూర్యనారాయణ, వి.సునీతదేవిలతో కూడిన వైద్యల బృందం జైలు అధికారులకు నివేదిక అందజేసింది. చంద్రబాబుకు చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఐదు రకాల మందులను వైద్యులు సిఫార్సు చేశారు.

రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్యుల నివేదిక ప్రకారం చంద్రబాబుకు ఆరోగ్యసమస్యలు తీవ్రంగా ఉన్నట్టు ఆయన వ్యక్తిగత వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వైద్యుల నివేదికను బయటపెట్టకుండా ఇప్పటి వరకు అంతా బాగుందంటూ జైలు అధికారులు చెబుతున్నారని కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. అధికారులు చెబుతున్న దానికి భిన్నంగా చంద్రబాబును పరీక్షించిన వైద్యుల నివేదిక ఉందని ఆయన వ్యక్తిగత వైద్యులు తేల్చి చెబుతున్నారు. తీవ్రమైన ఎండల కారణంగా కొద్ది రోజులుగా డీహైడ్రేషన్‌తో చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారని వారు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబుకి హైపర్‌ ట్రోపిక్‌ కార్డియో మైయోపతి సమస్య ఉందని, ఈ సమస్య కారణంగా డీహైడ్రేషన్‌తో గుండెపైనా ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఆరోగ్య సమస్యలను ప్రభుత్వం, అధికారులు.. చిన్నవి చేసి చూపిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement