Friday, April 26, 2024

మాస్క్ మానేశారు…శానిటైజ‌ర్ వ‌దిలేశారు…

రోజురోజుకీ పెరుగుతున్న కేసులు… 3 జిల్లాల్లో మరింతగా
రాష్ట్రంలో 90% తగ్గిన మాస్కు, శానిటైజర్ల అమ్మకాలు
నిబంధనలు గాలికొదిలి కరోనాతో చెలగాటం
ఏప్రిల్‌ నెలాఖరు దాకా కనీస జాగ్రత్తలు అనివార్యం
లేదంటే ముప్పు తప్పదని వైద్య నిపుణుల హెచ్చరిక


అమరావతి, : ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టేవరకు జాగ్రత్తలు పాటించాల్సిందేనని ఓవైపు ప్రపంచ వైద్య ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరిస్తుంటే.. మరోవైపు రాష్ట్రంలో కనీస నిబంధనలు కూడా పాటించేవారు కనిపించడం లేదు. ఫలితంగా తగ్గిందనుకుం టున్న కరోనా.. తిరిగి పంజా విసరబోతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి చూస్తుంటే రోజురోజుకు కోవిడ్‌ విజృంభించబోతోందని స్పష్ట ం గా అర్థమవుతోంది. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమవంతు బాధ్యతగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతంగా చేపడుతున్నా టీకా వేసుకునేందుకు చాలామంది ముందుకు రావడం లేదు. టీకా సంగతి పక్కన పెడితే.. కనీసం మాస్క్‌, శానిటైజర్‌లు కూడా 95 శాతం మంది ఉప యోగించడం మర్చిపోయారు. కోవిడ్‌ సమయంలో రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో చూసినా ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్‌, జేబులో శానిటైజర్‌ బాటిల్‌ పెట్టుకుని కనిపించేవారు. ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నంగా ప్రతి వంద మందిలో ఐదుమంది మాత్రమే మాస్క్‌లతో దర్శనమిస్తున్నారు. వారిలో ఒకరిద్దరు మాత్రమే శానిటైజర్‌ను ఉపయోగిస్తున్నారు. ఇలా అయితే రానున్న రోజుల్లో ప్రమాదం తప్పదని వైద్య ఆరోగ్య శాఖతో పాటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏప్రిల్‌ నెలాఖరు వరకు ఖచ్చితంగా వందకు వంద శాతం కోవిడ్‌ నిబంధనలను పాటించకపోతే మాత్రం పెను ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోవిడ్‌ వృద్దుల్లో అధిక శాతం కనిపించింది. వైరస్‌ కూడా వారినే అటాక్‌ చేసింది. దీంతో లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 80 శాతం వృద్దులే ఉండేవారు. ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నంగా కోవిడ్‌ చిన్నారులపై పంజా విసురుతోంది. తరగతి గదుల్లో కనీస నిబంధనలు పాటించకపోవడం, ప్రైవేట్‌ పాఠశాల యాజమాన్యం కోవిడ్‌ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం తదితర కారణాలు వెరసి పాఠశాల విద్యార్థులను కోవిడ్‌ వెంటాడుతోంది. గడిచిన వారం పది రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 60 శాతం పైగా పాఠశాలల్లోనే నమోదవుతున్నాయంటే పరిస్థి తి ఎంత ప్రమాదకరంగా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
నిబంధనలు గాలికొదిలేశారు.. కరోనాతో చెల గాటమాడుతున్నారు
రాష్ట్రంలో కోవిడ్‌ నిబంధనలు ఎక్కడా పాటిం చడం లేదు. వందల సంఖ్యలో జనం గుమికూడు తున్నప్పటికీ వారిలో ఒక్కరూ కూడా మాస్క్‌లు ఉపయోగించడం లేదు. కేవలం ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉన్నతాధికారులు మాత్రమే మాస్క్‌లు, శానిటైజర్లను వాడుతున్నారు. జిల్లా స్థాయిలో కొంతమంది అధికారులు నిబంధనలు పాటిస్తున్నా ఆయా కార్యాలయాల్లో పనిచేసే క్రింది స్థాయి అధికా రులు నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. ఇక వ్యా పారులు, సామాన్య ప్రజలైతే చెప్పాల్సిన పనిలేదు. షాపింగ్‌ మాల్‌లో కూడా చూద్దామన్నా నిబంధన లు అమలు జరుపుతున్న దాఖలాలు కనిపించడం లేదు. మాస్క్‌లు లేకుండా షాపింగ్‌ మాల్‌లో గంట ల తరబడి ప్రజలు షాపింగ్‌ చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కనీసం ఎంట్రన్స్‌లో శాని టైజర్‌ కూడా అందుబాటులో ఉంచడం లేదు. రాజ కీయ సభలు, సమావేశాలు, విందులు, వినోదాలు, శుభకార్యాలు.. ఇలా ప్రతి కార్యక్రమంలోను వేలాది మంది ఒకే వేదికపై చేరుతున్నా వారిలో 5 శాతం మంది మాత్రమే మాస్క్‌లతో కనిపిస్తున్నారు. మిగిలిన వారు అసలు కరోనా గురించే మర్చిపోయినట్లుగా కనిపిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది.
ఆ మూడు జిల్లాలలో మరింత పెరుగుతున్న కేసులు రాష్ట్రంలో శనివారం 380 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 13 జిల్లాల పరిధిలో 8 లక్షల 93 వేల 366 కేసులు నమోదయ్యాయి. వాటిలో 2083 మంది మాత్రమే వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు. అయితే గడిచిన వారం పది రోజులుగా పదుల సంఖ్యలో నమోదవుతూ వచ్చిన కేసులు క్రమేనా 380కి పెరిగాయి. ఇటీవల కాలంలో ఇదే అత్యధిక స్థాయి కేసులు. కోవిడ్‌ తగ్గుముఖం పట్టాక పెద్ద సంఖ్యలో కేసులు రావడం కూడా ఇదే తొలిసారి. ముఖ్యంగా చిత్తూరు, గుంటూరు, కర్నూలు జిల్లాలలో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం గడిచిన 24 గంటల్లో గుంటూరు జిల్లాలో 70 కేసులు, చిత్తూరు జిల్లాలో 60, కర్నూలు జిల్లాలో 51 కేసులు నమోదయ్యాయంటే.. ఆ మూడు జిల్లాలలో కేసుల సంఖ్య ఏ స్థాయిలో పెరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.

సెకండ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉంది

రాష్ట్రంలో కోవిడ్‌ తిరిగి విజృంభించబోతోంది. సెకండ్‌ వేవ్‌ ప్రమాదం కూడా పొంచి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మెడికవర్‌ హాస్పిటల్‌ సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ రవీంద్రరెడ్డి హెచ్చరించారు. ప్రజలు కోవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉండడంతో పాటు నిబంధనలను పాటించాలని, లేదంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారన్నారు. అదేవిధంగా ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కొంతమంది నిబంధనలను పాటించకపోవడంతో కేసుల సంఖ్య క్రమేనా పెరగడానికి బలమైన కారణంగా కనిపిస్తోందన్నారు.

90 శాతం తగ్గిన మాస్క్‌, శానిటైజర్‌ల అమ్మకాలు
గత ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబరు వరకు రాష్ట్రవ్యాప్తంగా ఏ ప్రాంతంలో చూసినా మాస్క్‌లు, శానిటైజర్ల విక్రయా లు కనిపించేవి. రోజుకు 5 లక్షలకు పైగా మాస్క్‌లు అమ్ముడుపోయేవి. అలాగే శానిటైజర్‌ చిన్న బాటిల్స్‌ అయితే లక్షల్లో విక్రయా లు జరిగేవి. 5 నుంచి 10 లీటర్ల టిన్నులు అయితే వేలల్లోనే కొనుగోలు చేసేవారు. ఏ షాపులో చూసినా మాస్క్‌లు, శానిటైజర్ల విక్రయాలే జోరుగా సాగేవి. మారుమూల ప్రాంతాల్లోని చిన్న షాపుల్లో సైతం మాస్క్‌లు, శానిటైజర్లు కొనుగోలు చేసేవారే ఎక్కువ సంఖ్యలో కనిపించేవారు. అయితే జనవరి నుంచి వాటి అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. కేవలం 10 శాతం మాత్రమే అమ్మకాలు జరుగు తున్నా యంటే రాష్ట్రంలో మాస్క్‌ల విక్రయాలు పూర్తిగా పడిపోయినట్లు స్పష్ట ంగా అర్థమవుతోంది.
బాధ్యతగా మెలిగి నప్పుడే
కోవిడ్‌ పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగి నప్పుడే వైరస్‌ను పూర్తిగా నివారించొచ్చని అక్షిత వైద్యశాల గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ డాక్టర్‌ పవన్‌కుమార్‌ అభిప్రాయ పడ్డారు. ప్రభుత్వం తమవంతు బాధ్యతగా అవసరమైన అన్నీ చర్యలను తీసుకుంటోందని, సమాజంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి కోవిడ్‌ పట్ల అప్రమత్తంగా ఉన్నప్పుడే సెకండ్‌ వేవ్‌ను అడ్డుకోగలమన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుకోవాలని, అందుకు అవసరమైన పౌష్టి కాహారాన్ని కూడా క్రమం తప్పంకుండా తీసుకుంటే చాలావరకు కోవిడ్‌ బారిన పడకుండా రక్షించుకోవచ్చన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం
ఒకవైపు కరోనా నుంచి కోలుకునే వారి సంఖ్య పెరుగుతున్నా.. కొత్త కేసులతో యాక్టివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూ వస్తోంది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్‌ కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖను ఆదేశించింది. అంతే కాకుండా కోవిడ్‌ సెంటర్లను పునరుద్ధరించాలని స్పష్టం చేసింది. కాంటాక్ట్‌, ట్రేసింగ్‌ ముమ్మరం చేయడంతో పాటు వైరస్‌ సోకిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని నిత్యం వివిధ జిల్లాల అధికారులతో మాట్లాడుతూ కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేస్తున్నారు. కేంద్ర మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, కేసులు భారీగా నమోదవుతున్న ప్రాంతాలను రెడ్‌ జోన్‌లుగా ప్రకటించాలని ఆదేశించారు. హోం క్వారంటైన్‌లో ఉన్న వారికి సైతం వైద్యులు అందుబాటులో ఉండి పూర్త స్థాయిలో పర్యవేక్షణ జరగాలని సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement