Saturday, April 27, 2024

ఇటు ఎండ‌లు – అటు వాయుగుండం…

అమరావతి : భానుడు తన ప్రతాపాన్ని చండప్రచండంగా చూపుతున్నాడు. ఎప్పటికపుడు రికార్డులు దాటేసుకుంటూ బుధవారం నాటికి అనేక ప్రాంతాల్లో 45 డిగ్రీలకుపైగా అధి క ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం నాటి మాదిరిగానే ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లొ అత్యధికంగా బుధవారం నాడు 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మంగళవారం ప్రకాశం జిల్లాలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెలిసిందే. ఎండల ధాటికి ప్రజలు బైటకు వచ్చేందుకు భయపడు తున్నారు. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా ఆరు డిగ్రీల మేర అధికంగా నమోదవుతున్నాయి. తూర్పు, ఆగ్నేయ ప్రాంతంలో నెలకొన్న వాతావరణ ప్రభావంతోనే సూర్యుడు నిప్పులు చెరుగుతున్నట్లు- వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. పలు జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. విజయవాడలో తొలిసారిగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక మిగతా ప్రాంతాల్లో శ్రీకాకు ళం, గుంటూరు జిల్లాల్లో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత, చిత్తూరు జిల్లాలో 45.5, నమోదు కాగా విశాఖ జిల్లాలో 45.3, కర్నూలులో 44.5, విజయనగ రంలో 45, తూర్పుగోదావరి 44.5, కృష్ణా జిల్లా 44.6, నెల్లూరులో 45.3 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమో దయ్యాయి. పగలు ఎండ, రాత్రి వేడిగాలులతో ప్రజలు అల్లా డుతున్నారు. భారత వాతావరణ కేంద్రం సూచనల ప్రకా రం మరింతగా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నందున అన్ని జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేశామని విప త్తులశాఖ కమిషనర్‌ కె కన్నబాబు తెలిపారు. ఏపి లోని 113 మండలాల్లో గురువారం తీవ్ర వడగాల్పులు, 217 మండలాల్లో వడగాల్పులు వీయనున్నా యని, శుక్రవారం 148 మండలాల్లో తీవ్ర వడ గాల్పులు, 207 మండలాల్లో వడగాల్పులు వీయనున్నాయని కమిషనర్‌ తెలిపారు. గురు వారం గుంటూరు జిల్లాలోని 29 మండ లాలు, కృష్ణాలో 27, విజయనగరంలో 19, విశాఖ జిల్లాలో 10 మండలాల్లో, శుక్రవారం నాడు గుంటూరు జిల్లాలో 33, కృష్ణాలో 24, పశ్చిమ గోదావరిలో 18, విజయనగరంలో 18, తూర్పుగోదావరిలో 16, శ్రీకాకుళం జిల్లాలో 10, విశాఖ జిల్లాలో 15 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని కమిషనర్‌ తెలిపారు. ప్రజలు ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వృధ్దులు వడగా ల్పుల బారిన పడకుండా ముం దస్తు జాగ్రత్తలు తీసుకోవాల ని, డీ హైడ్రేట్‌ కాకుండా ఉండేందుకు గాను ఓఆర్‌ఎస్‌ తీసుకోవాలని,లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరినీరు మొదలైనవి తాగాలని ప్రజలకు సూచించారు.

వాయుగుండం…
ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్‌ సముద్రం ప్రాంతాలలో బుధవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనుం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో ఇది మధ్య అండమాన్‌ సముద్రం, దాని పరిసర ప్రాంతాలలో మరింత బలపడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటలలో ఇది మరింత బలపడి అదే ప్రాంతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉత్తర-దక్షిణ ఉపరితల ద్రోణి జార్ఖండ్‌ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌ వరకు 1.5కిలోమీటర్ల ఎత్తువరకు ఏర్పడిందని దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల్లో విశాఖ, ఉభయ గోదావరి జిల్లాలు, కోస్తా, రాయలసీమ లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొన్ని జిల్లాల్లో పిడుగులు పడవచ్చని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఇక మిగతా ప్రాంతాల్లో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement